దోమకాటుతో తీవ్రంగా నష్టపోయిన వరి పంట తో రైతు ఆవేదన చెందాడు. ఆశించిన విధంగా పంట రాకపోవడంతో ఒక ఎకరం పొలంలో సన్న వరి తీవ్రంగా నష్టపోయి నిప్పంటించి దగ్ధం చేసాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాతూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుంటి నాగరాజు ఎకరం పొలం వరి వేయగా దోమపోటు తీవ్రంగా పంట పాడైపోయింది. చేసేదేమీలేక చేతికి రాదన్న ఆవేదనతో నిప్పు పెట్టినట్లు పేర్కొన్నారు.