ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. మహిళల నుంచి మంచి స్పందన కనబడుతుందన్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ నియోజకవర్గంలో 30 వేలకు పైగా పై చిలుకు సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.