మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. గుంతలుగా మారిన రోడ్లతో స్థానిక వాహనదారులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక వాహనదారులు, భక్తులు కోరారు.