
నర్సాపూర్: అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
నర్సాపూర్ పట్టణంలోని ఎస్ఎల్ఆర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం నర్సాపూర్ సీడీపీవో హేమ భార్గవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని ప్రీస్కూల్ కార్యక్రమాలను పరిశీలించి మరియు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య లక్ష్మి భోజనాన్ని పరిశీలించారు.