కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి కావాల్సిన పలు దేశీయ ఉత్పత్తులు అందించిన విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా, మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. ఈ కిట్‌కి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతి లభించింది.