అడవి మధ్యలో హైవేలు నిర్మించడంతో రోడ్డు దాటే సమయంలో వన్యప్రాణులు ప్రమాదాలకు గురై మృతిచెందుతున్నాయి. కొన్ని తీవ్రంగా గాయపడుతున్నాయి. ఇలాంటి ఘటనలను నివారించేందుకు మహారాష్ట్రలో ఇటీవల ప్రారంభమైన సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వే పైన యానిమల్ ఓవర్పాస్ను నిర్మించారు. దీని ద్వారా అటవీ జంతువులు రోడ్డును ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాటగలుగుతాయి.