పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో తనపై BJP ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెక్కడ పోయావని అడిగిన ప్రశ్నకు తాను కేంద్రానికి రాసిన లేఖలు విడుదల చేశారు. 'అభినందనలు చెప్పడం తప్పే అంటే అది మీ రాజకీయ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాను. నేను మంత్రి అయ్యాక 3 సార్లు కేంద్రానికి లేఖలు రాశాను. మా సీఎంతో కూడా కేంద్రాన్ని అడిగించా. నేను ఎక్కడ ఉన్నా ఆ శాఖకి పూర్తిగా న్యాయం చేస్తా' అని వ్యాఖ్యానించారు.