ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ సంచలన ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు నబీ వెల్లడించాడు. దాదాపు 13 సంవత్సరాలకు పైగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మొహమ్మద్ నబీ సేవలు అందించాడు. అయితే ప్రస్తుతం ఆయన వయసు సహకరించకపోవడంతో రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వివరించాడు.