యూపీ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున నాగ సాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కాగా నాగ సాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకుని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు.