రైతులకు అండగా నిలవాలి: జూపల్లి కృష్ణ
ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కాలువలను పునరుద్ధరించాలని, రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఆయన పానగల్ మండలంలోని దవాజిపల్లి, కొత్తపేట, బండపల్లి, జమ్మాపూర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్షేత్రస్థాయిలో నష్టాలను పరిశీలించి, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.