వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఈర్లదిన్నె సూగురు గ్రామానికి చెందిన భాస్కర్ గౌడ్ కుమార్తె ప్రియాంక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాలతో వైద్యం కోసం రూ. 2, 50, 000 ఎల్ఎసిని సోమవారం హైదరాబాద్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి కార్యాలయ సిబ్బంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.