అదనపు పాఠశాల గదుల ప్రారంభం: ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్
నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్ పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు గదులను శనివారం ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక చిన్న పల్లెటూరి నుంచి బయలుదేరిన నాగ్ అశ్విన్ ఇంత పెద్ద స్థాయికి ఎలా చేరుకున్నాడో విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందం, పార్టీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.