Dec 25, 2024, 09:12 IST/మక్తల్
మక్తల్
నర్వ: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీహరి
Dec 25, 2024, 09:12 IST
నర్వ మండలం లంకాల గ్రామంలోని చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణామయుడు యేసు ప్రభువు బోధనలు అచరణీయమైనవని అన్నారు. మత పెద్దలు ఎమ్మెల్యేను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.