TG: నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో వేటు వేశారు. ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ తో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. రేషన్, గుట్కా మాఫియా నుంచి వసూళ్లు, సొంత సిబ్బంది నుంచి కూడా వసూళ్లు చేసినట్లు తేల్చారు. జిల్లా ఇంటలిజెన్స్ అధికారిగా కవిత ఏడేళ్లు పనిచేశారు. సమగ్ర విచారణ తర్వాత కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.