AP: గుంటూరు జిల్లా మంగళగిరిలోని నరసింహస్వామి ఆలయంలో మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. కాగా, గత కొద్దీరోజులుగా మహిళా అఘోరి కనిపించకుండా తిరుగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నైకి ఆమె వెళ్తుండగా జగ్గయ్యపేట టోల్ ప్లాజా వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెకు నచ్చజెప్పి చెన్నై వైపు పంపించారు. అయితే చెన్నైకు వెళ్లిన అఘోరి మళ్లీ మంగళగిరిలో ప్రత్యక్షమయ్యారు.