హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి ప్రత్యేక బస్సుల కారణంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఎల్బీనగర్ కూడలి నుంచి పనామా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేపీహెచ్‌బీ నుంచి హయత్ నగర్ వరకు బస్సులు, ఇతర వాహనాలతో ప్రధాన రహదారి రద్దీగా మారింది.