కుంభమేళాతో లక్షల మందికి తాత్కాలిక ఉపాధి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తులతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ఒక్క పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5 లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది.