హాలియా: ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వ్యాపారులకు జరిమానాలు
హాలియా పట్టణంలో వీధి వ్యాపారస్తులకు, ఫుట్ పాత్ పై వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వారికి పురపాలక సంఘం వారు జరిమానాలు విధించారు. పురపాలక సంఘం, ఎస్ ఐ ఆదేశాలను ఖాతర్ చెయ్యకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వీధి వ్యాపారస్తులకు జరిమానాలు విధిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ సతీష్, పురపాలక సంఘం వర్క్ ఇన్స్పెక్టర్ సతీష్ చారి, తదితరులు పాల్గొన్నారు.