ఈవీఎం మిషిన్లు సీరియల్ ప్రకారం పెట్టండి -ఎంపీ అభ్యర్థి చామల

62చూసినవారు
నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెంటు పరిధిలోని నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలలో పలు పోలింగ్ బూత్ లను సోమవారం ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తోపాటు కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఈవీఎం మిషిన్లు సీరియల్ ప్రకారం పెట్టలేదని, కావాలనే ఇలా చేశారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు తెలియజేశానని ఆయన తెలిపారు. ఈవీఎం మిషన్లు వరుస క్రమంలో పెట్టకపోవడం మూలంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించాలని ఆయన కోరారు. అయన వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్