వేగంగా వెళ్తున్న లారీతో డేంజరస్ స్టంట్.. నెటిజన్ల ఆగ్రహం!

565చూసినవారు
జాతీయ రహదారిపై ఓ లారీ వేగంగా వెళుతోంది. హఠాత్తుగా దాని డ్రైవర్ సీట్‌లో నుంచి లేచి డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్లాడు. అలా ముందుకు వెళ్లి జాగ్రత్తగా నడుస్తూ మొత్తం తిరిగి వేరే డోర్ నుంచి క్యాబిన్‌లోకి ప్రవేశించాడు. అలా లోపలికి వచ్చి తిరిగి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. అంత సేపూ డ్రైవర్ లేకుండానే ఆ లారీ స్పీడ్‌గా వెళుతోంది. ఏ మాత్రం తేడా జరిగినా ఘోర ప్రమాదం చోటు చేసుకునేది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్