కట్టంగూరు మండలంలో నాలుగో వార్డ్ లో సాగర్ ట్యాంకు పైపు పగిలి గత పది రోజులుగా నీళ్ళు వృథా అవుతున్నాయి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యాంక్ ఐరన్ పైపు పగిలి వాటర్ వృథాగా పోతున్నాయని వాటర్ ట్యాంకు తడిసి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక సర్పంచ్ కి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎటువంటి మరమ్మతులు చెయ్యట్లేదు అని స్థానికులు వాపోతున్నారు. వెంటనే ట్యాంక్ కు మరమత్తులు చేసి వాటర్ పైపులు మార్చాలని కోరుచున్నారు.