

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం (వీడియో)
తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో భారీ వర్షం పడింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలోని అశ్వారావుపేట, ములుగు జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారంలో వడగండ్ల వానలు కురిశాయి. అల్లూరి జిల్లాలోని, మాడుగుల, మారేడుమిల్లి, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ, కంచికర్ల, ఇబ్రహీంపట్నం, తూర్పు గోదావరిలోని గోకవరంలో వర్షాలు, ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి.