AP: ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేవలం కేంద్రానికి లేఖ రాస్తే సరిపోదని, అమెరికా టారిఫ్‌ల పేరుతో దోచుకుంటున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. 100 కౌంట్ రొయ్యల ధర రూ.280 నుంచి దాదాపు రూ.200కి పడిపోయిందని, క్రాప్ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు.