TG: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(RRR) ప్రాజెక్టు విషయంలో సమీప ప్రాంతాల ప్రజలకు NHAI మరో శుభవార్త వినిపించింది. RRR పొడవునా సర్వీసు రోడ్లు నిర్మించాలని NHAI సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజలకు లబ్ధి చేకూరనుందని భావిస్తోంది. అయితే ఇదివరకే నిర్మించిన ORRను సర్వీసు రోడ్లతో కలిపి నిర్మించారు. ఈ సర్వీస్ రోడ్లు వాహనదారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో RRRకు కూడా సర్వీసు రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు.