ఎంపురాన్' సినిమా నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్‌ను ఈడీ అధికారులు సోమవారం విచారించారు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘన కేసులో ఈడీ ఆయనను ప్రశ్నించింది. గోకులం ఫైనాన్స్ సంస్థ ద్వారా రూ.వేల కోట్ల అనధికార నగదు లావాదేవీలు జరిపినట్టు గోపాలన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తులో భాగంగా కొన్ని రోజుల క్రితం చెన్నై, కొచ్చి తదితర నగరాల్లోని ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.