
హెచ్చరిక: 'బర్డ్ ఫ్లూ పక్షులకే పరిమితం కాదు'
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఇటీవలి కాలంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీలో మరణాలు కూడా సంభవించాయి. అయితే బర్డ్ ఫ్లూ..పక్షులకే పరిమితం కాకుండా పశువులు, మానవులకు వ్యాపించే అవకాశం ఉందని ప్రఖ్యాత వైరాలజిస్ట్, ప్రొఫెసర్ డాక్టర్ జాకబ్ జాన్ హెచ్చరించారు. ముందస్తు చర్యలు, జన్యు పర్యవేక్షణ యొక్క అత్యవసర అవసరం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.