ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సమయం దగ్గర పడుతోంది. వచ్చే వారంలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత ఫ్యాన్స్‌కి ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత మ్యాచ్‌లకు సంబంధించి అదనంగా టికెట్లను జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచే టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు టికెట్లను తొలి సెమీస్ ముగిశాక విడుదల చేసే అవకాశం ఉంది. టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్ వేదికగానే ఆ మ్యాచ్ జరగనుంది.