TG: ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా లేని భూముల్లో రైతులు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. బంజరు భూముల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకొని సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్తు అధికారులు, టీజీ రెడ్కో సంయుక్తంగా తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు సోలార్ యూనిట్ల ఏర్పాటు కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు.