
20 మంది రెవెన్యూ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో 20 మంది రెవెన్యూ ఉద్యోగులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంది. రెవెన్యూ సర్వేయర్లు, వీఆర్వోలపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం పేర్కొన్నారు. వీరంతా రెవెన్యూ పనులు, మ్యుటేషన్లో అవినీతికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు కలెక్టర్ తెలిపారు.