పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. 'ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను భయపెట్టడానికి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి చేస్తున్న కుట్ర' అని పేర్కొన్నారు.