మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మహారాజ్‌పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాము కాటు వల్ల ఎవరూ చనిపోరు అని మీకు తెలుసా? మహారాజ్‌పూర్ గ్రామంలో ఎవరైనా పాము కాటుకు గురైతే, వారు ఆసుపత్రికి వెళ్లకుండా వైద్యం కోసం బిదేహి బాబా ఆలయాన్ని సందర్శిస్తారని అనాదిగా ఉన్న నమ్మకం. పాముకాటుకు గురైన వ్యక్తి సజీవంగా ఇక్కడికి వస్తే, అతను కోలుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వెళ్తాడని ఇక్కడి ప్రజల బాగా నమ్ముతారు.