బీహార్‌లోని గయా జిల్లాలో ఓ నిరుపేద కూలీకి ఇటీవల ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నెలకు రూ.10 వేలు సంపాదించే కూలీకి రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు అందజేశారు. ఓ వ్యాపారి వద్ద రాజీవ్ కుమార్ వర్మ అనే వ్యక్తి నెలకు రూ.10 వేల జీతానికి పని చేస్తున్నాడు. ఆయనకు రూ.2 కోట్ల పన్ను నోటీసులు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపింది. రూ.67 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది.