విషాదంగా మారుతున్న విహారయాత్రలు
నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ విహారయాత్రలు విషాదమవుతున్నాయి. బుధవారం నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీ విహారయాత్రకు వచ్చిన ఘట్ కేసర్ కు చెందిన జగదీశ్వర్, సాగర్ బ్యాక్ వాటర్లో స్నానానికి దిగి నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు జగదీష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేయగా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. కాగా గత ఆరు నెలల్లో విహారయాత్రకు వచ్చి ఆరుగురు మృతి చెందారు.