ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక.. మహిళ మృతి (షాకింగ్ వీడియో)

1546చూసినవారు
పంజాబ్‌లోని లూథియానాలో అక్టోబర్ 6 న ఘోర ప్రమాదం జరిగింది. మాతా జాగరణ వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 7 మంది గాయపడ్డారు. ఈదురు గాలులు, తుఫాను కారణంగా వేదిక నిర్మాణం కూలిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్