బాసర అర్జీయూకేటి సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం రాత్రి విధులను బహిష్కరించి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పీయుసి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఏబీవీపీ నాయకులకు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య జరిగిన తోపులాటలో ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో అరెస్ట్ ఐన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.