భైంసా: పెన్షన్ ఇప్పిస్తానంటూ వృద్ధుడికి బురిడీ

74చూసినవారు
పెన్షన్ ఇప్పిస్తానంటూ డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన బైంసా పట్టణంలో చోటుచేసుకుంది. కుబీర్ మండలం మాలేగం గ్రామానికి చెందిన గంగాధర్ అనే వృద్ధుడు సోమవారం భైంసా బ్యాంకు సర్వీస్ పాయింట్ వద్ద 30వేలు డ్రా చేసుకొని బయటకు వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తి పెన్షన్ ఇస్తా తాత అని పలకరించాడు. రూ. 19 వేలు తీసుకొని అధికారి వద్ద పత్రాలపై సంతకం చేపిస్తానంటూ పరారయ్యాడు. ఎంతకీ రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్