హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్, ఫుడ్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శుక్రవారం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణ పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో బైంసా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం ప్రకాష్ లడ్డ తదితరులు పాల్గొన్నారు.