కుంభమేళా అంటే ఏంటి?
హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. దీనికోసం వారు వాసుకి అనే పామును తాడుగా చేసుకొని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతారు. అందులోనుంచి అమృతం వస్తుంది. దీనిని అసురులనుంచి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తుతాడు. రాక్షసుల నుంచి అమృతాన్ని జాగ్రత్తగా కాపాడుతాడు. ఆ సమయంలో అమృత బిందువులు మనదేశంలోని హరిద్వార్, ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయినిలో పడుతాయి. ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా జరుగుతుంది.