మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
హేమ, శ్రీకాంత్, జానీ మాస్టర్ బెంగళూరులోని రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను ఇప్పటికే వారు ఖండించారు. ఇప్పటికే రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని, తాను ఇంట్లోనే ఉన్నానని ఒక వీడియో విడుదల చేసిన నటి హేమ.. తాజాగా తన సోషల్ మీడియాలో ధమ్ బిర్యానీ తయారీ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వారేం పోస్ట్ చేస్తున్నారో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.