తానూర్ పోలీస్‌స్టేషన్ ను సందర్శించిన ఏఎస్పీ
నిర్మల్ జిల్లా తానూర్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటి ఎస్సై రమేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలింగే విధంగా చూడాలని అన్నారు.