గ్రామ సమస్యలు పరిష్కరించాలి

84చూసినవారు
గ్రామ సమస్యలు పరిష్కరించాలి
తానూర్ మండలం మొగ్లీ గ్రామస్తులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ్ రావు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గత 10సం. నుండి తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సిసి రోడ్లు, డ్రైనేజీ లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేపించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామస్తులు సునీల్ పటేల్, త్రిషారన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్