Oct 25, 2024, 09:10 IST/
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత
Oct 25, 2024, 09:10 IST
TG: సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. న్యాల్కల్ కస్తూర్బా గురుకులం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు శ్వాసకోస సమస్యలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమత్తమైన సిబ్బంది.. చికిత్సా నిమిత్తం విద్యార్థినులను హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.