కర్ణాటకలో షాకింగ్ ఘ‌ట‌న‌.. ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌ (వీడియో)

72చూసినవారు
కర్ణాటకలోని శివమొగ్గలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్య‌క్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఎస్‌యూవీ కారు నడుపుతున్న ఓ వ్యక్తి అతి వేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆప‌మ‌ని అడిగాడు. ఆ డ్రైవర్ కారు ఆపకుండా ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీసుని ఢీకొట్టి కారు బానెట్‌పై 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు.

సంబంధిత పోస్ట్