
కామారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం.. మూడు ఇళ్లు దగ్ధం
కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు పక్కన ఉన్న మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ఇళ్లలో ఉన్న విలువైన సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ. 6 లక్షల మేర నష్టం జరిగిందని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.