May 15, 2024, 02:05 IST/బోధన్
బోధన్
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారింపు
May 15, 2024, 02:05 IST
బోధన్ మున్సిపల్ పాలకవర్గం, అధికార యంత్రాంగం పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టిని సారించింది. తేలికపాటి వర్షాలు కురియడం వలన మురికి కాలువలలో చెత్తాచెదారం సమకూరింది. మురికి కాలువలలోని చెత్తాచెదారాన్ని మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేస్తున్నారు. మున్సిపల్ యంత్రాంగం కార్మికులు చేపడుతున్న పరిశుభ్రత పనుల పై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.