Oct 18, 2024, 05:10 IST/
ప్రభుత్వ ఆస్పత్రులకు పోలీస్ భద్రత.. సర్కార్ కీలక నిర్ణయం
Oct 18, 2024, 05:10 IST
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించనుంది. 24 గంటలూ పర్య వేక్షణ చేయడంతోపాటు ప్రధాన గేట్ల వద్ద స్క్రీనింగ్, చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే రోగుల బంధువులకు విజిటర్స్ పాస్ అందించనుంది. వైద్యుల రక్షణకు కమిటీలు ఏర్పాటు చేయనుంది.