
నిజామాబాద్: మిస్సైన మహిళ ఎముకలు లభ్యం
ఏడు నెలల క్రితం అదృశ్యమైన మహిళ ఎముకలు లభ్యమైన ఘటన మోపాల్ మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన విజయ ఏడు నెలల కిందట అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంచిప్ప ప్రాంతంలోని ఒక కల్వర్టు కింద మహిళా ఎముకలను గుర్తించారు.