నెమ్మదిగా వెళ్ళమన్నందుకు వృద్ధుడిపై దాడి.. చివరికి (వీడియో)

51చూసినవారు
వృద్ధుడిపై ఓ బైకర్ దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. HYD అల్వాల్ పీఎస్ పరిధిలో గత నెల 30న ఆంజనేయులు (65) అనే వృద్ధుడు రోడ్డు దాటే క్రమంలో బైక్ పై వెళ్తున్న యువకుడిని నెమ్మదిగా వెళ్లమన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధుడి తలకు బలమైన గాయం కాగా కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్