ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TDPMA ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ & పీజీ కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలపై హామీ ఇవ్వడంతో బంద్ మిరమించారు. దీంతో నాలుగు రోజుల తరువాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు తెరుచుకున్నాయి.