
నిజామాబాద్: మహిళ దారుణ హత్య
ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ కి చెందిన మహిళ హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహిళకు భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసినట్టు తెలిపారు. దీంతో నిందితుడిని గురువారం రిమాండ్ కు తరలించారు.